తాగుబోతుల సంఘం అధ్యక్షుడిగా సోమువీర్రాజు!:నారాయణస్వామి

108
narayanaswamy
- Advertisement -

త్రాగుబోతుల సంఘంకు సోమువీర్రాజు అధ్యక్షుడుగా అయ్యాడని‌ ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు..ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఏపి మంత్రి ఆళ్లనాని, ఎమ్మెల్యే ఆదిమూలంలు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కలు చెల్లించుకున్నారు.. అనంతరం ఆలయ వెలపలకు వచ్చిన ఆయన బిజేపిపై తీవ్రంగా మండిపడ్డారు.. రాష్ట్ర ప్రజలందరికి నూతన‌ సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. పేదలందరికి అండగా నిలుస్తున్న సీఎం‌ జగన్మోహన్ రెడ్డికి స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.

ఛీప్ లిక్కర్ యాభై రూపాయలకు ఇచ్చి ప్రజలను సోమువీర్రాజు సంతోషం పెడతాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు..సోము వీర్రాజును ఎలా బిజేపి రాష్ట్ర అధ్యక్షుడుని చేశారో అర్ధం కావడం లేదని,సారాయిని ఇచ్చి ఏవరైనా డబ్బులు, ఓట్లు అడుగుతారా అని ఆయన ప్రశ్నించారు.. సోమువీర్రాజు వ్యక్తం ఏంటా అని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారని,మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం సోమువీర్రాజు చేయడం భాధాకరంమన్నారు..జగన్ ని జైల్‌కి పంపడం ఎవరి తరం కాదని,జగన్మోహన్ రెడ్డిపై భగవంతుడు, ప్రజల ఆశీస్సులు మెండుగా ఉందని‌ ఆయన తెలిపారు..జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఎలాంటి‌ చిన్న తప్పు చేయలేదని, అన్ని పార్టిలు ఒకటై జగన్మోహన్ రెడ్డిపై కుట్ర పొందితున్నట్లు ఆయన మండిపడ్డారు.. చంద్రబాబుకి సీఎంగా ఉంటే ధనంవంతులు అందరికి‌ మంచి జరుగుతుందనే అన్ని పార్టి ఒక్కటైందన్నారు..త్రాగుబోతులకు‌ సోమువీర్రాజు అధ్యక్షుడు అయ్యాడో అర్ధం కాలేదని, సోమువీర్రాజు లాంటి వ్యక్తులకు అధ్యక్ష పదవి ఇస్తే డిపాజిట్ కూడా రాదని నేను మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాని ఆయన విమర్శించారు..

- Advertisement -