- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నగరి ఎమ్మెల్యే రోజా మొక్కలు నాటడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణికి గ్రీన్ ఛాలెంజ్ విసరడం జరిగింది. అందులో భాగంగా రోజా విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి ఇవాళ కురుపాం నియోజకవర్గంలోని చినమేరంగిలో మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ మొక్కలే మానవాళికి జీవనాధారం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటుదాం. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చుదాం అన్నారు. కాగా ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఇదివరకే ఏపీలో ఎంతో మంది ప్రముఖులు మొక్కలు నాటిన సంగతి తెలిసిందే.
- Advertisement -