ఏపీలో కొత్తగా 7,293 కరోనా కేసులు..

134
corona

ఏపీలో గడచిన 24 గంటల్లో 75,990 కరోనా పరీక్షలు నిర్వహించగా 7,293 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,751కి పెరిగింది. ఇప్పటివరకు 5,97,294 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 65,794 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో కరోనా మృతుల సంఖ్య తాజా మరణాలతో కలిపి 5,663కి చేరింది.

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,011 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 57 మరణాలు సంభవించాయి. ప్రకాశం జిల్లాలో 10 మంది, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎనిమిదేసి మంది చొప్పున మృత్యువాత పడ్డారు. తాజాగా, 9,125 మందికి కరోనా నయం అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా ప్రకటనలో తెలిపింది.