ఏపీలో 5,078 యాక్టివ్ కేసులు..

138
corona
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఒక్కొక్క రోజు కేసుల సంఖ్య తక్కువగా నమోదైనా… మళ్లీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 510 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 67,495 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు కరోనా వల్ల చనిపోయారు. గుంటూరు, కడప, విశాఖ జిల్లాల్లో ఒక్కక్క మరణం సంభవించింది.

ఇదే సమయంలో 665 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,75,025కి చేరుకుంది. మొత్తం 7,052 మరణాలు సంభవించాయి. 8,62,895 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,078 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -