కరెంట్ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ పోరుబాట

2
- Advertisement -

ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపు పోరుబాట పట్టింది కాంగ్రెస్. మీకు ఓట్లు వేయడమే ప్రజలు చేసిన పాపమా? అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. కరెంట్ ఛార్జీల పెంపు సరికాదన్న వైఎస్ షర్మిల..మూడు రోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చారు.

విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కార్ అని మండిపడ్డారు. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ళ విషయంలో .. మా తప్పేం లేదని, మాకసలు సంబంధమే లేదని, భారం మాది కాదని, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారు. సర్దుబాటు కాదు ఇది.. ప్రజలకు “సర్దుపోటు”. కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధం ? ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా ? 5 ఏళ్లలో వైసీపీ భారం రూ.35వేల కోట్లు.. 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా? వైసీపీకి మీకు ఏంటి తేడా ? అని ప్రశ్నించారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని, కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.

Also Read:Vijayamma: జగన్‌పై తప్పుడు ప్రచారమా?

- Advertisement -