స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు అందుకున్న సీఎం జగన్‌..

476
- Advertisement -

సీఎం పదవి చేపట్టాక తొలిసారి విశాఖప‌ట్నం చేరుకున్న వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి ఘన స్వాగ‌తం ప‌లికారు. విశాఖ‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్.. త‌న కోసం వ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు అభివాదం చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చినముషిడివాడలోని శారద పీఠానికి వెళ్లారు. సంప్ర‌దాయ వ‌స్త్రాలు ధ‌రించిన జ‌గ‌న్‌ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

AP CM YS Jagan

అనంతరం రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. మరికాసేపట్లో సీఎం తిరుగుపయనమవుతారు. పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు ఆశ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి 10 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు.. శారదా పీఠాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆయన వెంట వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణా రెడ్డి, తలశిల రఘురాంతో పాటు మరో 7గురు వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారు.

- Advertisement -