ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా విజయంపై గట్టిగానే కన్నెసింది. అయితే ఈ సారి విజయం మాత్రమే కాదు క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇప్పాటికే సిఎం జగన్ పలు మార్లు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కూడా. వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు సాధించాలని గట్టిగానే దిశనిర్దేశం చేస్తూనే ఉన్నారు. అయితే అది సాధ్యమేనా అంటే వై నాట్ అంటోంది వైసీపీ. ఎదుకంటే ఎక్కడ అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, పథకాల ద్వారా ప్రజలు పారదర్శికంగా లబ్ది పొందుతున్నారని వైసీపీ చెబుతోంది. దాంతో ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుతున్నారని జగన్ పదే పదే చెబుతున్నారు. అందుకే ఈసారి కేవలం విజయం మాత్రమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా 175 కు 175 సీట్లు కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు సిఎం జగన్.
అందువల్ల ఎన్నికలకు కేవలం ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండడంతో.. నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇలా పార్టీకి చెందిన ప్రతిఒక్కరు నిత్యం ప్రజల్లో ఉండాలని జగన్ ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ” గడపగడపకు మన ప్రభుత్వం ” పేరుతో వైసీపీ ఓ కార్యక్రమానికి శ్రీకారం సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రజా అభిప్రాయాలను స్వయంగా తెలుసుకుంటూ ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను నేరుగా ప్రజాప్రతినిధులే ప్రజలకు వివరించడంతో ప్రజల్లో వైసీపీ సర్కార్ పై సానుకూలత మరింత పెరుగుతుందని జగన్ ఆలోచన. అయితే వైసీపీ నేతలు మాత్రం ” గడప గడపకు మన ప్రభుత్వం ” కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎవరో ఒకరు తప్పా పెద్దగా నేతలెవరూ ప్రజల్లోకి వెళ్ళేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దాంతో ఆ మద్య ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షలో 42 మంది ఎమ్మెల్యేలను జగన్ గట్టిగానే హెచ్చరించారు. తీరు మార్చుకొని నిత్యం ప్రజల్లో ఉండాలంటూ ఆదేశించారు. అయితే అధినేత ఇచ్చిన వార్నింగ్ లను నేతలు పెడచెవిన పెట్టినట్లే తెలుస్తోంది. ‘ గడప గడపకు మన ప్రభుత్వం ‘ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేందుకు ఎమ్మేల్యేలు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. దాంతో మరిసారి తాజాగా ఎమ్మెల్యేలతోనూ, పార్టీ నేతలతోనూ సమీక్ష నిర్వహించిన సిఎం జగన్.. ఈసారి మరింత సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
గతంలో హెచ్చరించినప్పటికి.. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని 32 మంది ఎమ్మెల్యేలపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారట సిఎం జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎమ్మెల్యేల తీరు మార్చుకొని నిత్యం ప్రజల్లో మమేకం అవ్వకపోతే.. ఆయా నియోజిక వర్గాలలో కొత్త అభ్యర్థులను ప్రకటిస్తానని జగన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. 175 కు 175 కచ్చితంగా గెలవాల్సిందేనని ఎమ్మెల్యేలకు మరోసారి గుర్తు చేశారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన ఆశిస్తున్నట్లుగా ఏపీలో 175 స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తారా ? లేదా అవన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోతయా ? అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి…