25మందితో జగన్‌ కేబినెట్ ..లిస్ట్ ఇదే..!

437
ap cm jagan
- Advertisement -

ఏపీ కేబినెట్ విస్తరణకు మరికొద్దిగంటల్లో తెరపడనుంది. ఇవాళ జరిగే వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో కేబినెట్‌ కూర్పుపై చర్చించి,పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. సామాజికవర్గాల వారీగా సమీకరణలు,పాత,కొత్త కలయికతో విధేయత కలిగిన వారికే కేబినెట్‌లో సీఎం జగన్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సామాజికవర్గాల వారీగా చూస్తే రెడ్డి సామాజికవర్గం నుంచి ఏడుగురికి,బీసీ-6, కాపు-2, కమ్మ-2, ఎస్సీ మాల-2, ఎస్సీ మాదిగ-1, ఎస్టీ-1, క్షత్రియ-1, ముస్లిం మైనార్టీ-1 – బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కొక్కరికి కేబినెట్‌లో చాన్స్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రెడ్డిసామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం దక్కేవారిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, శిల్పా చ‌క్రపాణి రెడ్డి, మేక‌పాటి గౌతం రెడ్డి, మేడా మల్లిఖార్జున రెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక బీసీ సామాజికవర్గం నుంచి మోపిదేవి వెంకటరమణ,తమ్మినేని సీతారం,పిల్లి సుభాష్‌ చంద్రబోస్,ముత్యాలనాయుడు,పార్ధసారధి పేర్లు వినిపిస్తున్నాయి. క‌మ్మ సామాజికవర్గం నుంచి కొడాలి నాని, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పేర్లు పరిశీలిస్తుండగా కాపు సామాజికవర్గం నుంచి అవంతి శ్రీనివాస్,కురసాల కన్నబాబు, ఎస్సీ మాల సామాజికవర్గం నుంచి మేకతోటి సుచ‌రిత, విశ్వ‌రూప్ ,ఎస్సీ మాదిగ సామాజిక వ‌ర్గం నుంచి ఆదిమూల‌పు సురేష్‌,ఎస్టీ కోటాలో పుష్ప‌శ్రీ వాణి,మైనార్టీ కోటాలో ఇక్బాల్‌,వైశ్య సామాజిక వర్గం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి,క్ష‌త్రియ సామాజికవ‌ర్గం నుంచి ప్ర‌సాద‌రాజు,బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం నుంచి మ‌ల్లాది విష్ణు పేర్లు వినిపిస్తన్నాయి. మొత్తంగా జగన్‌ కేబినెట్‌లో బెర్త్ ఎవరికి దక్కుతందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -