జగన్ టార్గెట్ 175.. అందుకేనా?

40
- Advertisement -

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. అసలు ప్రతిపక్షమే లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలలు కంటున్నారు. అయితే అవన్నీ పగటి కలలని ఈసారి వైసీపీకి గెలుపే కష్టమని ప్రత్యర్థి పార్టీలు అభిప్రాయ పడుతున్నాయి. కానీ జగన్ మాత్రం వైనాట్ క్లీన్ స్వీప్ వెట్ అండ్ సి అంటూ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్ ఈ స్థాయిలో కాన్ఫిడెంట్ గా ఉండానికి ఏమైనా రీజన్ ఉందా ? అసలు క్లీన్ స్వీప్ పై వైసీపీ ఎందుకంతా ధీమా ప్రదర్శిస్తోంది. అనే దానిపై పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల దొంగఓట్ల వ్యవహారం ఏపీలో తీవ్ర చర్చనీయాంశం అయింది.

గత ఎన్నికల్లో భారీగా దొంగఓట్లు పోలయ్యాయని స్వయంగా ఎన్నికల కమిషనే చెప్పడంతో..గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు అంతా బోగసే యేనా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు. కాగా దొంగఓట్ల దైర్యంతోనే జగన్ 175 స్థానాలను టార్గెట్ గా పెట్టుకున్నారా అనే అనుమానాలు కొత్తగా వ్యక్తమౌతున్నాయి.దీంతో ఈ వ్యవహారం వైసీపీని చిక్కుల్లోకి నేడుతోంది. తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని తమ సర్కార్ అమలు చేస్తున్న పథకాలే తమకు 175 స్థానాల్లో విజయం కట్టబెడతాయని జగన్ చెబుతున్నారు. కానీ నిజంగా 175 స్థానాల్లో విజయం సాధిస్తే అది దొంగఓట్ల ఖాతాలోకి వెళ్లిపొందా అనేది ఇప్పుడు వైసీపీని ఆందోళనకు గురి చేస్తోందట. పైగా ఎన్నికల కమిషన్ స్వయంగా దొంగఓట్ల ప్రస్తావన తీసుకురావడంతో వైసీపీ నేతలు కూడా గట్టగా ఖండించలేకపోతున్నారు. ఇక వచ్చే ఎన్నికల వేల ఈ అంశాన్ని ప్రత్యర్థి పార్టీలు బలంగా ప్రజల్లోకి తీసుకుల్లే అవకాశం ఉంది. మొత్తానికి వైనాట్ 175 టార్గెట్ ఇప్పుడు కొత్త అనుమానాలు తావిస్తోంది.

Also Read:కాంగ్రెస్ టికెట్ల అమ్మకం.. నేడే లాస్ట్!

- Advertisement -