చిరంజీవిపై జగన్ రెడ్డి ప్రతీకారం

36
- Advertisement -

బాపట్లలోని ఎస్ఎస్‌వీ థియేటర్‌లో ‘భోళా శంకర్’ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. అనుమతి లేకపోయినా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ పోలీసులు సినిమాను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి సినిమాను ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు టికెట్లు అధిక ధరలకు అమ్మడం లేదని థియేటర్ యజమానులు చెబుతున్నారు. అసలు టికెట్లు అధిక ధరలకు అమ్మనప్పుడు సినిమాని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?, నిజానికి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ రోజున టికెట్లను అధిక ధరలకు అమ్మడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలోనే భోళాశంకర్‌ సినిమా టికెట్‌ ధరల పెంపు కోసం నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఐతే ఆ నిర్మాణ సంస్థ అడ్వెంచర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇప్పటివరకు సంబంధిత పత్రాలు, డాక్యుమెంట్లు అందజేయలేదని ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఆచార్య, వాల్తేరు వీరయ్య చిత్రాల నిర్మాణ సంస్థలు ఆయా పత్రాలన్నీ ఇవ్వడంతో, ప్రత్యేక టికెట్ల రేట్లు పొందారని తెలిపింది. ఇప్పుడు మాత్రం భోళాశంకర్‌కు సంబంధించి డాక్యుమెంట్లు ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

Also Read:ఇదేనా బీజేపీ సమన్యాయం?

మొత్తానికి జగన్ ప్రభుత్వం పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ కి జగన్ గట్టిగానే బదులు తీర్చుకున్నారు. మరోపక్క భోళా శంకర్ సినిమాకి బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే.. చిరంజీవి ఖాతాలో మరో ప్లాప్ పడినట్టే. ఇదిలా ఉండగా మెగాస్టార్‌ చిరంజీవి పై ఉన్న అభిమానాన్ని అభిమానులు మరోసారి వినూత్న రీతిలో చాటుకున్నారు. హైదరాబాద్ లో గూగుల్ మ్యాప్‌పై మెగాస్టార్ చిత్రాన్ని గీసేందుకు కొందరు ఆయన ముఖాకృతిని పోలిన రూట్‌మ్యాప్ ఎంచుకున్నారు. మొత్తం 800కి.మీ మేర చెక్ పాయింట్స్ పెట్టుకుని వివిధ వాహనాల్లో గూగుల్ నావిగేషన్ ఆధారంగా ఆయా మార్గాల్లో ప్రయాణించారు. ఆ రూట్లన్నీ కలపగా గూగుల్ మ్యాప్స్‌పై అద్భుతమైన మెగాస్టార్ చిత్రం ఆవిష్కృతమైంది.

Also Read:పవన్..ఓజీ ఓవర్సీస్‌ పార్ట్‌నర్‌ లాక్‌!

- Advertisement -