జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం జగన్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం నిధుల విడుదల చేసిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన జగన్..వాలంటీర్ల క్యారెక్టర్లను తప్పుబట్టిన పవన్‌ని తూర్పారాబట్టారు.
వాలంటీర్లు అమ్మాయిల్ని లోబర్చుకున్నారని విమర్శలు చేస్తున్నారని.. అమ్మాయిల్ని లోబర్చుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం దత్తపుత్రుడి క్యారెక్టర్ అంటూ పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలతో అక్రమ సంబంధం…అమ్మాయిలను లోబర్చుకుని, వారిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్లు కాపురం చేసి వదిలేయడం ఆయనకి అలవాటేనంటూ విమర్శించారు. ఒకరితో వివాహబంధంలో ఉంటూ ఇంకొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:రక్తపోటు తగ్గాలంటే?
అలాంటి వ్యక్తి వాలంటీర్ల వ్యవస్థపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పవన్…చంద్రబాబుకు వాలంటీర్‌గా పనిచేస్తూ ప్యాకేజీ స్టార్‌గా మారిపోయాడని ఎద్దేవా చేశారు. వాలంటీర్లపై తప్పుడు మాటలకు స్క్రిప్ట్ రామోజీరావుదని.. నిర్మాత చంద్రబాబైతే.. నటన, మాటలు అన్నీ దత్తపుత్రుడు పవన్‌వి అని తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. బీజేపీతో పొత్తు.. చంద్రబాబుతో కాపురం.. చంద్రబాబుపై పోటీ ఒక డ్రామా, బీజేపీతో స్నేహం మరో డ్రామా.. తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా అన్నారు.
Also Read:కీ అప్డేట్ ఇచ్చిన విశ్వక్!