గత ఎన్నికల ముందు జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఈ కేసు రాష్ట్ర రాజకీయల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. నిందితులకు జగన్ అండగా నిలుస్తున్నారని ప్రతిపక్ష నేతలు, సీబీఐ ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తావిస్తున్నాయి. తాజాగా పొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చిన్నన్న ను అతికిరాతకంగా చంపింది ఎవరో, ఎవరు చంపించారో అందరికీ తెలుసునని, తన ఇద్దరు చెల్లెమ్మలను కూడా తనకు ప్రత్యర్థులుగా మార్చుతున్నది ఎవరో తెలుసని జగన్ అన్నారు. హంతకులకు మద్దతు పలుకుతున్నది చంద్రబాబేనని జగన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ రకమైన వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించే జగన్ వ్యాఖ్యానించినప్పటికి, తనకే ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయనేది చాలమంది వాదన. .
ఎందుకంటే గత ఎన్నికల ముందు వివేక హత్య విషయంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. పైగా ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ కూడా జగన్ సర్కార్ పైనే వేలెత్తి చూపిస్తూ వచ్చింది. వివేకా హత్యలో జగన్ సన్నిహితులు ఉన్నారని, నిందితులకు జగన్ అండగా నిలుస్తున్నారని స్వయంగా సీబీఐ పలు మార్లు వెల్లడింహింది. ఇప్పుడేమో ఎన్నికల ముందు ఈ కేసును చంద్రబాబు వైపు మళ్లించే ప్రయత్నం చేసిన ఎవరు నమ్మరనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో వివేకా హత్య విషయంలో జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసిన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుందని, ఆ వ్యాఖ్యలు పార్టీని, తనను మరింత దెబ్బ తీస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేకా విషయంలో జగన్ స్పందించే తీరు ఎన్నికల ముందు పోలిటికల్ హీట్ పెంచే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read:కాల్షియం తగ్గిందా.. ఇవి తినండి!