- Advertisement -
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు చేరుకున్నారు ఏపీ సీఎం జగన్. ఈనెల 22 నుంచి 26 వరకు జరగనున్న సదస్సుకు జగన్ బృందం హాజరకానున్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం జగన్ దావోస్‌కు వెళ్లగా సదస్సులో సీఎం అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కి పైగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రపంచ నలుమూలల నుంచి 2 వేల 200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థిక వేత్తలు సదస్సుకు హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు చేసుకోనుంది.
సీఎం అయిన మూడేళ్ల తర్వాత తొలిసారి పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు జగన్ వెళ్లడంతో పర్యటనపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Advertisement -