- Advertisement -
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ మృతి ఎంతో బాధను కలిగిస్తోందని…మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం చెప్పలేనంత ఆవేదనను కలిగించిందన్నారు.
గౌతమ్‌రెడ్డి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులు. చేసే పని పట్ల నిబద్ధత కల్గిన నాయకులు అని ట్వీట్ చేశారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తికి గుండెపోటు రావడం బాధాకరమని మాజీ మంత్రి,టీడీపీ నేత లోకేష్ అన్నారు.
గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు వైసీపీ ఎంపీ విజయ్‌సాయి రెడ్డి. యువ నాయకుడిగా, మంత్రిగా గౌతమ్ రెడ్డి గారు రాష్ట్రానికి విశేషమైన సేవలందించారన్నారు.
- Advertisement -