ఏపీలో ప్రస్తుతం అధికార పార్టీ రాబోయే ఎన్నికలే టార్గెట్ గా ముందుకు కదులుతోంది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో సత్తా చాటి కనీవినీ ఎరుగని విజయాన్ని నమోదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాగా ఈసారి అంతకు మించి అనేలా వ్యూహాలు రచిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ పట్టుకున్నారు. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలకు దిశ నిర్దేశం కూడా చేశారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదని, నేతలంతా ప్రజల్లో ఉండాలని, టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవకూడదని సూచిస్తున్నారు వైఎస్ జగన్. అయితే క్లీన్ స్వీప్ అనేది అంతా ఈజీ కాదనే విషయం జగన్ తో పాటు వైసీపీ నేతలకు కూడా బాగానే తెలుసు. అయినప్పటికి క్లీన్ స్వీప్ పక్కా అనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తోంది వైసీపీ..
అయితే జగన్ ఎందుకింత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అనే దానికి వైసీపీ నుంచి వినిపిస్తున్న సమాధానం ఒక్కటే.. ప్రస్తుతం ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఏపీలో అమలౌతున్నాయని, అలాగే అమలౌతున్న పథకాలు పరదర్శికంగా ప్రజలకు చేరవేస్తున్నామనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. దాంతో లబ్ధి పొందిన ప్రతిఒక్కరూ వైసీపీ వెంటే ఉంటారని పట్టుదలగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రతిష్టాత్మకంగా ఒ కార్యక్రమాన్ని చేపట్టారు సిఎం జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఎమ్మెలే, ఎంపీ, మంత్రి, నేతలు ఇలా వైసీపీ చెందిన ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండాలని సూచిస్తున్నారు.
అయితే జగన్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై నేతలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దాంతో దాదాపు 30 ఎమ్మెల్యేలపై సిఎం జగన్ అసంతృపిగా ఉన్నారట. ఆ మద్య నిర్వహించిన సమీక్షలో పలువురు నేతలపై జగన్ గట్టిగానే అసంతృపి వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం పై ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు కూడా. వారిలో మాజీ మంత్రి కొడాలి నాని, ఆర్కే రోజా వంటి వారు కూడా ఉన్నారు. ఇక తాజాగా మరోసారి ఎమ్మెల్యేల పని తీరుపై ఈ నెల 14 సమీక్ష నిర్వహించనున్నారు సిఎం జగన్. ఈ సమావేశంలో మరోసారి ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు ఇవ్వనున్నారు. ఎందుకంటే గత సమీక్ష ద్వార పలువురి ఎమ్మెల్యేలను మందలించినప్పటికి.. వారిలో ఏమాత్రం మార్పు కనిపించకపోవడంతో ఈసారి 30 ఎమ్మెలేలపై గట్టిగానే నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి 175 స్థానాల్లో విజయం సాధించాలనే టార్గెట్ పెట్టుకున్న వైఎస్ జగన్మోన్ రెడ్డికి.. ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రస్తుతం తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. మరి వైఎస్ జగన్ ఈ సారి తమ ఎమ్మెల్యేలకు ఎలాంటి హెచ్చరికలు ఇస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి..