మరో భారీ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం..

95
cm jagan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆనాడు వైసీపీ మేనిఫెస్టోలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్‌వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం ”వైఎస్‌ఆర్‌ జలకళ” పథకంను అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 28వ తేదీన వైఎస్‌ఆర్‌ జలకళ పథకంను క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.

ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తన పాదయాత్రలో బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్‌ వారికి అండగా నిలుస్తానని ఆనాడు హామీ ఇచ్చారు. సాగునీటి కోసం వేల అడుగుల లోతుతో బోరుబావులను తవ్వించుకునేందుకు రైతులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం, అందుకోసం అప్పులపాలవుతున్న వైనంను గమనించిన జగన్ రైతులు పడుతున్న అవస్థలను పూర్తిగా తొలగించేందుకు ఇచ్చిన హామీ కార్యరూపం దాలుస్తోంది.