- Advertisement -
ఏపీ సీఎం జగన్,ఎంపీ విజయసాయిరెడ్డికి సమన్లు జారీ చేసింది ఈడీ కోర్టు. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. జగన్,విజయసాయిరెడ్డితో పాటు హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
ఫార్మా కంపెనీలకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి నాంపల్లి ఎంఎస్‌జే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్‌పై జగన్ న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు 11న నెల్లూరు జిల్లాలో అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది…. అదే రోజు ఈడీ కోర్టుకు రావాలని సమన్లు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.
- Advertisement -