ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం తరచూ తెరపైకి వస్తూనే ఉంది. జగన్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని గతంలో చంద్రబాబు, పవన్ కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూ వచ్చారు. కానీ జగన్ సర్కార్ మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదు అని చెబుతూ వచ్చింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చింది. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే జగన్ ముందస్తు ఎన్నికలకు వెల్లడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడట. ఎందుకంటే ఏపీలో అరాచక పాలన సాగుతోందని నిన్న మొన్నటివరకు చంద్రబాబు ప్రజల్లో గట్టిగా ప్రచారం చేస్తూ వచ్చారు.
అసలే ప్రజల్లో జగన్ సర్కార్ పై పలు అంశాల్లో వ్యతిరేకత ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఇదిలా ఉంచితే ఈసారి 175 స్థానాల్లో విజయం సాధించాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి టార్గెట్ రిచ్ కావాలంటే ఈ వ్యతిరేకతను అధిగమించాల్సి ఉంటుంది. దాంతో అనూహ్యంగా స్కిల్ స్కామ్ ను బయటపెట్టి చంద్రబాబును జైలుకు పంపడంతో తనపై ఉన్న వ్యతిరేకత ను దైవర్ట్ చేసుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుత పరిణామాలు చూస్తే చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి.
Also Read:సైమా అవార్డ్స్ -2023 విజేతలు వీరే..
దీంతో ఇదే ఊపులో ఎలక్షన్స్ కు వెళితే అటు టీడీపీని అణగదొక్కడం ఇటు పార్టీకి మైలేజ్ పెంచుకోవడం రెండు జరుగుతాయని భావించి జగన్ ముందస్తు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తేల్చిచెప్పారాయన. దీంతో ఏపీలో ముందస్తు ఎన్నికలు కన్ఫర్మ్ అయ్యాయనే చెప్పాలి. అటువైపు కేంద్ర ప్రభుత్వం జమిలి ఎలక్షన్స్ వైపు అడుగులు వేస్తోంది. దాంతో వచ్చే ఏడాది జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. దాంతో కేంద్రప్రభుత్వం జమిలి ఎన్నికలకు సై అంటే షెడ్యూల్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందుకే జగన్ ముందు జాగ్రత్తగా ముందస్తు ఎన్నికలను కన్ఫర్మ్ చేసినట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.