విశాఖ అందమైన నగరమని అందరికీ తెలుసు.. విశాఖకు వచ్చిన వారికి ఎవరికైనా ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని ప్రసంగించారు సీఎం. నూతన సాంకేతికత వినియోగంలో భారత్ పరుగులు పెడుతోంది.. క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.. అవసరమైన ఎకో సిస్టమ్ తీసుకురావాలన్నదే మా లక్ష్యం.. రాష్ట్రాన్ని క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా తీర్చిదిద్దుతాం అన్నారు.
సుందరమైన విశాఖలో బీచ్ లు, పర్యాటక ఆతిథ్యం మరచిపోలేనివి.. మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరంగా విశాఖ మారిపోయింది.. న్యాయవ్యవస్థ అత్యంత ముఖ్యమైనది.. కొన్ని కేసులు జాప్యం కావచ్చుగానీ… చాలా కేసులు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయి అన్నారు.
ప్రజలకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది. ఏదేని సమస్యకు ఇరుపక్షాలు ఆమోదయోగ్యంగా పరిష్కరించుకోవడానికి సహకరించాలి.. మధ్యవర్తిత్వం నిర్వహించడానికి మధ్యవర్తికి మెలకువలు అవసరం.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుంది.. న్యాయం పొందడం తమ హక్కు అని కోర్టులకు ప్రజలు వస్తుంటారు అన్నారు.
Also Read:జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

