- Advertisement -
ప్రపంచానికి యోగా విలువను చాటి చెప్పింది ప్రధాని మోదీ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. యోగా ప్రాముఖ్యతను తెలియజేసి ప్రతి ఏడాది యోగా డే నిర్వహించుకునేలా చేశారు అన్నారు. ఈ ఏడాది థీమ్ ‘యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్’ అన్నారు.
ఇది దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం అన్నారు. జూన్ 21న ఏపీలో చరిత్ర సృష్టించబోతున్నాం అన్నారు. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న ఒక గిఫ్ట్ యోగా అన్నారు. యోగాకు దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ఖచ్చితంగా నరేంద్ర మోదీయే అన్నారు.
మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది యోగా అన్నారు. అందరి జీవితాల్లో యోగా ఒక భాగం కావాలి… యాంత్రిక జీవనంలో ఒత్తిడిని అధిగమించడానికి ఉపశమనమే యోగా అన్నారు.
Also Read:కాళేశ్వరం నోటీసులపై ఈటల
- Advertisement -

