వెలిగొండ నిర్వాసితులకు రూ.300 కోట్లు

2
- Advertisement -

వెలిగొండ ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితుల త్యాగాలు వృథా కావని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. వారి వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ నిర్వాసితుల జీవితాలు అందరి కంటే మెరుగ్గా ఉండేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు 2,351 మంది నిర్వాసిత కుటుంబాల ఖాతాల్లో నేరుగా రూ.300 కోట్లను జమ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

హోంమంత్రి అనితను కించపరిచేలా మేకప్ గురించి మాట్లాడుతారా? అని ప్రశ్నించారు చంద్రబాబు.రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఒక దళిత మహిళ అని, శాంతిభద్రతలను కాపాడే ఆడబిడ్డగా ఆమెను చూసి ప్రతి ఒక్కరూ గర్వపడాలని పేర్కొన్నారు. హోంమంత్రి మేకప్ గురించి కొందరు మాట్లాడటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను అవమానపరిచేలా మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.

Also Read:గుండెపోటు రాకుండా..కార్డియాలజిస్ట్ చిట్కాలు!

- Advertisement -