సింహాచలం ప్రమాద ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని …మృతుల కుటుంబాలకు రూ. 25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై అధికారులను చంద్రబాబు ఆరాతీశారు. ఈ ప్రమాదంపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్కడి పరిస్థితిపై కలెక్టర్, ఎస్పీతో మాట్లాడటం జరిగిందని, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
సింహాచలం ప్రమాదం ఘటన దుర్ఘటన దురదృష్టకరం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు.
స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.
Also Read:సింహాచలం చందనోత్సవంలో అపశృతి

