ఫ్రీ బస్ స్కీంపై ఏపీ సీఎం రివ్యూ

10
- Advertisement -

ఉచిత బస్సు పథకం అమలు తీరును సమీక్షించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఘాట్ రోడ్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని సీఎం ఆదేశించారు. మహిళా ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

గడిచిన 30 గంటల్లో 12 లక్షల మందికి పైగా మహిళల ప్రయాణం చేయగా ఎల్లుండి నుంచి బస్సుల్లో మహిళల రద్దీ బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆధార్ జిరాక్స్, సెల్‍ఫోన్ లో సాఫ్ట్ కాపీనీ అనుమతించే అంశం పరిశీలన చేస్తున్నారు.

ఫ్రీ బస్సు స్కీము తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ ప్రెస్ లు(90/-), గరుడ AC వాహనాలు (110/-), ప్యాకేజ్ టూర్ బస్సులకు వర్తించదు అని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు గమనించగలరని…తితిదే వారి చర్చలలో అధికారులు తితిదే వారి నుంచి మరింత సహకారం అందజేస్తూ, భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించవల్సినదిగా అడిగారు…తిరుపతి రైల్వే స్టేషను, బస్టాండ్ ప్రాంతాల నుంచి భక్తుల సౌకర్యార్థం శ్రీ వారి మెట్టుకు మరిన్ని బస్సు సర్వీసుల పెంపుదలకు కోరడం జరిగింది అన్నారు.

Also Read:పరదా…ఎమోషనల్ మూవీ

- Advertisement -