AP:పంచ సూత్రాలతో మీకోసం రైతన్నా

5
- Advertisement -

వ్యవసాయ రంగంలో గత 17 నెలలుగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అద్భుత ప్రగతిని వివరిస్తూనే, ఇకపై సాగును శాశ్వతంగా లాభసాటి చేసేందుకు ‘పంచ సూత్రాల’తో ఒక సమగ్ర కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ నెల 24 నుంచి రాష్ట్రంలో ఒక చారిత్రక ఉద్యమంలా “మీకోసం రైతన్నా” కార్యక్రమం మొదలుకానుంది.

రైతు పొలంలో ఫలితాలు చూపే ఐదు ప్రధాన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సమర్థవంతమైన నీటి నిర్వహణ, బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉందో, ఏది వేస్తే ఎక్కువ ధర వస్తుందో ఆ పంటల సాగుకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భూసార పరీక్షల ద్వారా సాగులో విప్లవం తేనున్నారు. పంటకు అదనపు విలువ జోడించి, లాభాలను పెంచడం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాలతో ఆర్థిక భరోసా కల్పించనున్నారు.

నవంబర్ 24 నుంచి 29 వరకు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా ప్రతీ రైతు ఇంటికి వెళ్తారు. పంచ సూత్రాల గురించి, ప్రకృతి సేద్యం వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక లాభాల గురించి రైతు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు.

Also Read:Nikhat Zareen:నిఖత్ ఖాతాలో మరో స్వర్ణం

- Advertisement -