ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

5
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీకానున్నారు చంద్రబాబు. రక్షణమంత్రి, హోంమంత్రి, ఆర్థికమంత్రులను కలవనున్నారు ఏపీ సీఎం.

రైల్వే, జల్‍శక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రులతోనూ వేర్వేరుగా భేటీకానున్నారు సీఎం. కొత్త నేర చట్టాల అమలుపై హోంమంత్రి సమీక్షకు హాజరుకానున్నారు. అలాగే రేపు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు యాపిల్ ఎండీ. 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరుకానున్నారు చంద్రబాబు.

మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్. ఉన్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే తెగువ, అసాధారణ కార్యదక్షత, భయాన్ని, నిరాశనిస్పృహలను దరిచేరనివ్వని ధీశక్తి హనుమ సొంతం అని ఎక్స్ వేదికగా తెలిపారు. శ్రీరామ భక్తుడి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా అని ఆకాంక్షించారు.

Also Read:వడగళ్ల వర్షం..విమానం ధ్వంసం!

- Advertisement -