- Advertisement -
ఏపీ బడ్జెట్ సమావేశాల ముహుర్తం ఖరారైంది. మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానుండగా మార్చి నెలాఖరు వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మార్చి 7న తొలిరోజు దివంగత సభ్యులకు సభ సంతాపం తెలియజేయనుంది.
మార్చి 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. మార్చి 11 లేదా 14న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రూ.2.30 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సుమారు 15 నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ప్రస్తుత బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -