జూలై 12న ఏపీ బడ్జెట్‌..ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?

592
jagan
- Advertisement -

వైసీపీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ముహుర్తం ఖరారైంది. జూలై 12న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్‌. ఇప్పటికే పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్న సీఎం జగన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండనుంది..?ఎన్ని లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడతారన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

జూలై 11న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జూలై 12న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక జగన్‌ తొలిసారిగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ దాదాపుగా రూ.2.17 లక్షల కోట్లుగా ఉండొచ్చని అధికార వర్గాల సమాచారం.

బడ్జెట్ సమావేశాలకు జగన్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ సారి బడ్జెట్‌లో నవరత్నాల అమలుకు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. రైతు భరోసా, అన్నదాతలకు సున్నా వడ్డీకే రుణాలు, పంట బీమా కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వంటి వాటికి కేటాయింపులు ఉండే అవకాశముంది. మొత్తంగా జగన్ సర్కార్‌ పూర్తి స్ధాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం,అది తొలిసారి కావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -