2025-26 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ రూ.3,22,359 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు కాగా ద్రవ్య లోటు రూ.79,926కోట్లుగా అంచనా వేశారు. మూల ధన వ్యయం అంచనా రూ. 40,635కోట్లుగా తెలిపారు.
ఇక ప్రధానంగా కేటాయింపులను చూస్తే..
()వ్యవసాయానికి రూ. 48 వేల కోట్లు
()పాఠశాల విద్యాశాఖకు రూ. 31,806 కోట్లు
()బీసీ సంక్షేమం కోసం రూ. 23,260 కోట్లు
()వైద్యరోగ్య శాఖకు రూ. 19,265 కోట్లు
()పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి రూ.18,848 కోట్లు
()జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
()పురపాలక శాఖకు రూ. 13,862 కోట్లు
()తల్లికి వందనం పథకం కోసం రూ.9,407 కోట్లు
()నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ. 1,228 కోట్లు
()ఉన్నత విద్యకు రూ. 2,506 కోట్లు
()ఎస్సీల సంక్షేమానికి రూ. 20,281 కోట్లు
()ఎస్టీల సంక్షేమానికి రూ. 8,159కోట్లు
()అల్ప సంఖ్యాక వర్గాల కోసం రూ. 5,434కోట్లు
()మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమంకోసం రూ.4,332 కోట్లు
Also Read:కొల్లాపూర్‌లో జూపల్లి అనుచరుల వీరంగం
()ఇంధన శాఖకు రూ 13,600 కోట్లు
()వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
()సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు
()ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి రూ. 10,619 కోట్లు
()రవాణా శాఖకు రూ. 8,785 కోట్లు
()అమరావతి నిర్మాణం కోసం రూ.6,000 కోట్లు
()రహదారుల నిర్మాణానికి రూ. 4,220 కోట్లు
()రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు రూ. 10కోట్లు
()రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సీఎం కాల్ సెంటర్ కోసం రూ. 101కోట్లు
()ఎన్టీఆర్ భరోసా కోసం రూ.27,518 కోట్లు
()ఆదరణ పథకం కోసం రూ. వెయ్యి కోట్లు
()డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కోసం రూ. 3,486 కోట్లు కేటాయించారు.

