క్రిప్టో కరెన్సీ..తమన్నా, కాజల్ పోలీసుల విచారణ!

15
- Advertisement -

పుదుచ్చేరి కేంద్రం వెలుగులోకి వచ్చింది క్రిప్టో కరెన్సీ మోసం. ఈ కేసులో హీరోయిన్స్ తమన్నా , కాజల్‌ లను విచారించనున్నారు పోలీసులు . క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆకర్షించి నిర్వాహకులు వేలాది మంది నుండి డబ్బులు వసూలు చేశారు.

2022లో కోయంబత్తూరును ప్రధాన కార్యాలయంగా ప్రారంభమైంది. నటి తమన్నా ఈ ఆఫీస్‌ను ప్రారంభించగా ఆ తర్వాత ఓ స్టార్ హోటల్లో జరిగిన కంపెనీ ఈవెంట్‌కు నటి కాజల్ అగర్వాల్ హాజరయ్యారు. దీంతో ఈ క్రిప్టో కరెన్సీపై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడింది.

ఆ తర్వాత వేలాది మంది నుండి డబ్బులు సేకరించారు నిర్వాహకులు. ఇక ఈ కేసులో నితీష్ జైన్ (36), అరవింద్ కుమార్ (40)లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ లను విచారించనున్నారు పోలీసులు.

Also Read:TTD: వైభవంగా శివపార్వతుల కల్యాణం

- Advertisement -