నగరంలో భారీ వర్షాలు.. జీహెచ్ ఎంసీ అలర్ట్

317
Heavy Rains In Hyderabad
- Advertisement -

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఏవిధ‌మైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 384 ప్ర‌త్యేక బృందాల‌ను రంగంలోకి దించింది జిహెచ్ఎంసి . విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి చెందిన 13 ప్రత్యేక డిజాస్టర్ రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయిలో నియమించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూం సిసి కెమెరాల ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్నారు జిహెచ్ఎంసి అధికారులు. గత రాత్రి నుండి మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ లు నగరం మొత్తం క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటిస్తున్నారు. అత్యవసర పరిస్థుతుల్లో డయల్ 100, జిహెచ్ఎంసి కాల్ సెంటర్ 040-21111111 లకు ఫోన్ చేయాలని బల్దియా విజ్జప్తి . భారీ వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫ్ రెన్స్ నిర్వహించారు కమిషనర్ లోకేష్ కుమార్.

వీటిలో 252 మొబైల్ బృందాలు, 132 స్టాటిక్ బృందాలు ఉన్నాయి.మొత్తం 252 మొబైల్ బృందాల‌లో ఇన్‌స్టాంట్‌ రిపేర్ టీమ్‌లు 79, మినీ మొబైల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు 120, మొబైల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు 38, సెంట్ర‌ల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు 15 ఉన్నాయి.దీనిలో డి.సి.ఎం వ్యాన్‌లో ఐదుగురు లేబ‌ర్లు, ఒక జ‌న‌రేట‌ర్‌, నీటిని తొల‌గించే పంపులు, చెట్ల‌ను క‌ట్‌చేసే మిష‌న్లు ఇతర ప‌రిక‌రాల‌తో సిద్దంగా ఉంటారు.
సెంట్ర‌ల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు (15)సెంట్ర‌ల్ కంట్రోల్ రూంలో 15 ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను అందుబాటులో ఉంచారు.

ప్ర‌తి బృందంలో డి.సి.ఎం వ్యాన్‌, ఐదుగురు లేబ‌ర్లు, ఒక జ‌న‌రేట‌ర్‌, నీటిని తొల‌గించే పంపులు, చెట్ల‌ను క‌ట్‌చేసే మిష‌న్లు ఇతర ప‌రిక‌రాల‌తో సిద్దంగా ఉంటారు. స్థానిక ఎమ‌ర్జెన్సీ బృందాలు (132) న‌గ‌రంలోని అత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను స్థానికంగా నియ‌మించారు. న‌లుగురు కార్మికులు, ప‌లు ప‌రిక‌రాల‌తో ఉండి నాలాల్లో నీటి ప్ర‌వాహాన్ని నిలువ‌రించే ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను తొల‌గించ‌డం చేప‌డుతారు. నీటి నిల్వ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించ‌డానికి 255 పంపుల‌ను సిద్దంగా ఉంచారు.

- Advertisement -