అనుష్క…న్యూ ఇయర్ గిఫ్ట్

410
anushka
- Advertisement -

‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’, ‘భాగమతి’ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసిన అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్ధం’ అనే చిత్రంలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో భారీస్థాయిలో విడుదల కానుంది.

న్యూ ఇయర్ సందర్భంగా అనుష్క లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. అనుష్క లుక్‌ని అందరిని ఆకట్టుకుంటుండగా ఈ మూవీలో అనుష్క సాక్షి పాత్ర‌లో మూగ‌మ్మయిగా కనిపించబోతున్నట్లు సమాచారం.

ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -