నెట్టింట్లో విరుష్కా పాప ఫోటో వైరల్‌..

252
viruska

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శ‌ర్మ సోమ‌వారం పండంటి ఆడబిడ్డకు జ‌న్మిన‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన కోహ్లీ మీ అంద‌రి ప్రేమానురాగాల‌కు ధ‌న్య‌వాదాలు. కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉంది. పాప‌, అనుష్క శ‌ర్మ ఇద్ద‌రు ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో మా ప్రైవ‌సీని మీరంతా గౌర‌విస్తార‌ని ఆశిస్తున్నా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. విరాట్ దంప‌తులు పండంటి బేబికు జ‌న్మ‌నిచ్చింద‌ని తెలిసిన అభిమానులు , సెల‌బ్రిటీలు ఈ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

తాజాగా కోహ్లి సోదరుడు వికాస్ విరుష్కాల పాప కాళ్ల ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఇంట్లోకి ఏంజెల్ వ‌చ్చింది. ప‌ట్ట‌రానంత సంతోషంగా ఉంది అని క్యాప్ష‌న్ ఇచ్చారు. వికాస్ షేర్ చేసిన పోస్ట్‌ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అనుష్క,విరాట్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున‌్నారు.