టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న బ్యూటీ అనుష్క . తాజాగా భాగమతిగా తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసేందుకు ప్రేక్షకుల ముందుకురానుంది. పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో ఈ మూవి తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్,టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
అయితే, మొదటి నుంచి ఈ సినిమా జానర్‌పై సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. తొలుత అంతా అరుంధతి,రుద్రమదేవి తరహాలో భాగమతి మూవీ ఉంటుందని భావించగా తాజాగా మరోవార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది.
అందరూ అనుకుంటున్నట్లుగా ‘భాగమతి’ హారర్ థ్రిల్లర్ కాదట. ఇదో పొలిటికల్ థ్రిల్లర్ అని.. 500 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనకి సమకాలీన పరిస్థితులను ఓ పాడుబడిన భవంతితో ముడిపట్టి ఈ సినిమాని తెరకెక్కించారట. అనుష్క ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనుంది.
లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయిన అనుష్క ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకోవడం ఖాయమని అంటున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను దాదాపు 40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించారు.