భాగమతి సంక్రాంతికి వస్తోంది..?

196
Anushka Shetty's Bhagmati Release Date?
- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క సైజ్ జీరో అయినా.. బిగ్ సైజ్ అయినా.. ఆమె టాలెంట్ ముందు బలాదూర్. లేడీ ఓరియెంటెండ్ చేసినా, ఇన్నోసెంట్ గాల్ గా చేసినా.. స్వీటీ వందకు వంద మార్కులు కొట్టేయాల్సిందే. తెలుగు, తమిళ్ సినిమాల్లో సూపర్ సక్సెస్ అయిన ఈ బ్యూటీ క్రేజ్ బాలీవుడ్ దాకా చేరింది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమా భాగమమతి మాత్రమే. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేసిన స్వీటీ కెరీర్ లో.. ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు కనిపిస్తాయి. హీరోయిన్స్ కూడా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టగలరని నిరూపించి.. మళ్లీ ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ కి ప్రాణం పోసింది స్వీటీ.

Anushka Shetty's Bhagmati Release Date?

అయితే బాహుబలి సెకండ్ పార్ట్ తర్వాత అనుష్క నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. భారీ సైజ్ కారణంగా ఎక్కువ షూటింగుల్లో కూడా పాల్గొనడం లేదు. వచ్చిన ఆఫర్స్ లో కొన్నిటిని రిజెక్ట్ చేసిందనే టాక్ ఉంది. మరికొన్ని ఆఫర్స్ ని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా.. బాహుబలి షూటింగ్ లో ఉన్నప్పుడే ప్రారంభమైన భాగమతి మూవీని మాత్రం పూర్తి చేసే పనిలో అనుష్క ఉంది. ఆ హిస్టారికల్ థ్రిల్లర్ కథని పిల్ల జమిందార్ దర్శకుడు అశోక్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న భాగమతి ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉంది.

ఈ పనులన్నీ పూర్తి చేసుకుని.. త్వరలోనే హైదరాబాద్ కు వచ్చి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి భాగమతిని ఆడియన్స్ ముందుకు రావాలన్నది నిర్మాతల ఆలోచన అంటున్నారు. ఇప్పటివరకు కనీసం ఫస్ట్ లుక్ – పోస్టర్ లని రిలీజ్ చేయని పరిస్థితిలో.. రిలీజ్ డేట్ చెబితే జనాలు నమ్ముతారా అనే డౌట్ కూడా ఉందట.

- Advertisement -