‘బాహుబలి-2’ కలెక్షన్ల పరంగా ఎంత రికార్డు సృష్టించిందో,ఇందులో పాత్రలు ప్రభాస్, రానా, అనుష్కల నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ‘బాహుబలి-2’లో ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనుష్కను ఓ ఆసక్తికర ప్రశ్న అడిగితే, ఏమాత్రం తడుముకోకుండా ప్రభాస్ అందంగా ఉంటారని బదులిచ్చారు. రానా తనకు సోదరుడు లాంటివాడని తెలిపింది స్వీటీ. ‘ఆయన(రానా) నన్ను బ్రదర్ అంటారు.. నేనూ బ్రదర్ అనే పిలుస్తా’ అని చెప్పుకొచ్చింది..
ఇప్పుడు స్విటీ ఇలా ఎందుకు చెప్పిందన్న డౌట్ రావోచ్చు.. వీరిద్దరికి చాలా రోజుల నుంచి మంచి కెమిస్ట్రీ ఉంది. వీరిద్దరు కలిసి ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ దగ్గరయ్యారని, ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు బాగా అర్థం చేసుకున్నారని, ఈ క్రమంలోనే ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకున్నారని…. బాహుబలి సినిమా షూటింగ్ ముగిసే సమయానికి ఇద్దరి ప్రేమ వ్యవహారం మరింత ముదిరిందన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క ‘భాగమతి’ చిత్రంలో నటిస్తున్నారు. జి. అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఎస్. తమన్ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
https://www.instagram.com/p/BUEfFpnl-B5/