వివాదంలో విరుష్క జంట..!

326
- Advertisement -

కొద్దిరోజుల క్రితం ముంబైలో విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కారులో వెళుతుండగా అర్హాన్‌ సింగ్‌ అనే వ్యక్తి తన కారులో నుంచి ప్లాస్టిక్‌ కవర్‌ను రోడ్డుపై పడేయడం.. ఇది గమనించిన అనుష్క కారు ఆపి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. దీన్ని వీడియో తీసి విరాట్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడం తెలిసిందే. అర్హన్ ప్రైవసీకి భంగం కలిగించడంతో విరుష్క జంటపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను చేసిన పనికన్నా అనుష్క, విరాట్ లు చేసిన పని చెత్త అని అర్హన్ తో పాటు అతడి తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anushka Sharma

ఈ నేపథ్యంలో విరాట్‌ జోడీకి వ్యతిరేకంగా అర్హాన్‌ లీగల్‌ నోటీసులు పంపాడు. ‘నేను చేసింది తప్పే అయినా, విరాట్‌ జంట దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో నాపై తప్పుడు ప్రచారం జరిగింది. దీంతో నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఇందుకు విరాట్‌, అనుష్క నాకు క్షమాపణలు చెప్పాలి’ అని తన లాయర్‌ ద్వారా పంపిన లీగల్‌ నోటీసులో అర్హాన్‌ పేర్కొన్నారు. ఈ నోటీసులపై విరాట్‌ దంపతులు స్పందించాల్సి ఉంది.

- Advertisement -