అనుష్క ‘నిశ్శ‌బ్దం’ ట్రైల‌ర్‌ విడుదల చేసిన నాని

375
Nishabdham
- Advertisement -

అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుదలవుతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న చిత్రమిది.

క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్ లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మాణతలో టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను శుక్ర‌వారం నేచురల్ స్టార్ నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ‘‘ఇదుగో..మా స్వీటెస్ట్ స్వీటీ ‘నిశ్శ‌బ్దం’ ట్రైలర్. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’’ అని చిత్ర యూనిట్‌కి నాని శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సినిమా లో అత్యధిక భాగం అమెరికాలో చిత్రీక‌రించారు.

- Advertisement -