సర్‌ ప్రైజ్‌ ఇచ్చిన అనుపమ..

279
Anupama surprise to fans
- Advertisement -

అనుపమ పరమేశ్వరన్… ఈ హీరోయిన్ పేరునే ఇప్పుడు టాలీవుడ్ జపం చేస్తోంది. మలయాళ రీమేక్‌ ‘ప్రేమమ్‌’తో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ తెలుగులో శతమానం భవతి,ఉన్నది ఒకటే జిందగీ వంటి సినిమాలతో ప్రేక్షకులకు బాగా కనెక్టైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అ…ఆతో ఈ భామ జాతకం మారిపోయింది. టాలీవుడ్‌,కోలీవుడ్‌లో వరుస ఆఫర్లతో తెగ సంబరపడిపోతోంది. తమిళ,మళయాల ఇండస్ట్రీలో సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ అంటేనే ఇష్టమని చెబుతోంది.

nani-anupama

ఇక సాధారణంగా టాలీవుడ్‌లో రాణిస్తున్న అగ్ర హీరోయిన్లు తెలుగులో మాట్లాడటం చాలా తక్కువ. అయితే ఈ బ్యూటీ మాత్రం ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు తెలుగు నేర్చుకుంటోంది. తెలుగు భాష నేర్చుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదని అంటోంది ఈ మల్లూ బేబీ. సినిమాల్లోకి రాకముందు నేను అందరితోనూ ఇట్టే కలిసేదాన్ని కాదు. అయితే, తెలుగు వాతావరణానికి మాత్రం కలసిపోయాను. ఓ విధంగా చెప్పాలంటే, ఇక్కడి మనుషులే నన్ను అలా కలిపేసుకున్నారేమో. అందుకే తెలుగు నేర్చుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు అని చెబుతోంది.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు నాని ద్విపాత్రాభినయం చేస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలతో బిజీగా ఉంది అనుపమ.

- Advertisement -