ధృవ్ విక్రమ్‌తో అనుపమ

16
- Advertisement -

టిల్లు స్వ్కేర్ చిత్రంతో సక్సెస్ బాట పట్టిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా హిట్ తర్వాత సౌత్‌లో అన్ని భాషల్లో నటిస్తోంది అనుపమ. ఇటీవలే పరదా అనే ఓ సినిమా అనౌన్స్ చేయగా ఇందులో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నారు.

అప్లాస్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్ పై ధృవ్ విక్రమ్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా మామన్నన్ సినిమా దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాకు బైసన్ అనే టైటిల్ ఖరారు చేయగా తమిళ్‌లో తెరకెక్కనుంది. టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండగా పోస్టర్ లో హీరో మోకాళ్ళ మీద పరిగెత్తే పొజిషన్ లో కూర్చోగా, వెనకాల భారీ దున్నపోతు బొమ్మ ఉంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా అని తెలుస్తుంది.

Also Read:పవన్‌పై మరోసారి ముద్రగడ ఫైర్

- Advertisement -