ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్నీ గుర్తుపట్టండి..!

948
- Advertisement -

అనుపమ పరమేశ్వరన్ ఈ అమ్మడు టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ అమ్మడి అందానికి, అభినయానికి కుర్ర వెర్రెత్తిపోతుంది. తెలుగులో ‘‘అ ఆ, ప్రేమమ్, శతమానం భవతి’’ సినిమాలతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ మలయాళీ భామ ఆ తర్వాత సినిమాలతో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సరసన ‘తేజ్ .. ఐ లవ్యూ’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది.

Anupama Parameswaran Childhood Photo

ఈ అమ్మడు సినిమాల్లోనే కాదు సోషల్‌ మీడియాలో కూడా అందరిని అకర్షిస్తోంది. అయితే ఈ మలయాళీ బ్యూటీ సోషల్ మీడియాలో తాజాగా తన చిన్ననాటి ఫొటో పెట్టి మరింత ఆకర్షించింది. ఈ ఫొటోలో చిన్నప్పటి అనుపమ.. ఏదో ఆలోచిస్తూ కూర్చొంది.

ఫొటో చూసిన ఆమె అభిమానులంతా దీనిని షేర్ చేస్తుండటంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఫొటోపై లైకులు, కామెంట్లు పెడుతూ హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. ‘వావ్.. క్యూట్ లుక్ అని కొందరంటుంటే.. నా గురించే ఆలోచిస్తున్నావా?’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది.

- Advertisement -