తన ఎఫైర్ పై హోమ్లీ బ్యూటీ క్లారిటీ

27
- Advertisement -

యంగ్ హీరోయిన్ ‘అనుపమ పరమేశ్వరన్’ పై ఓ రూమర్ ఉంది. టాలీవుడ్ యంగ్ హీరోని ఆమె ప్రేమిస్తున్నారంటూ పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ కథనాలపై అనుపమ పరమేశ్వరన్ క్లారిటీ ఇచ్చింది. ఆమె లేటెస్ట్ మూవీ ఈగల్. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ‘అనుపమ పరమేశ్వరన్’ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈగల్ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్ర చేశానని అన్నారు.

అందంగా, అమాయకంగా కనిపించే తన పాత్రలో పవర్, స్ట్రెంగ్త్ ఉన్నాయని అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ఇక తనపై ఉన్న ఓ పుకారు క్లారిటీ ఇచ్చింది అనుమప. ఓ యంగ్ హీరోని అనుపమ పరమేశ్వరన్ ప్రేమిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సదరు వార్తల్లో నిజం లేదన్న అనుపమ పరమేశ్వరన్.. తాను ఏ హీరోని ప్రేమించడం లేదని ఆమె చెప్పారు. ఏది ఏమైనా హోమ్లీ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ మొన్నటివరకూ పద్దతికి పర్యాయపదంలా ఉండేది.

కానీ, “టిల్లు స్క్వేర్” సినిమా ప్రమోషన్స్ కంటెంట్ తో ‘అనుపమ పరమేశ్వరన్’ ఒక్కసారిగా హాట్ బ్యూటీగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. పైగా ఈ “టిల్లు స్క్వేర్” సినిమాలో అనుపమ అందంతో పాటు ఆమె సెక్సాప్పీల్ కూడా కుర్రకారుని కుదిపేస్తోందట. “రాధిక 2” అనే క్యారెక్టర్ తో అనుపమ కూడా అదరగొట్టింది అంటున్నారు. మరి చూడాలి, సిద్దూ జొన్నలగడ్డతో ‘అనుపమ పరమేశ్వరన్’ ఏ రేంజ్ రొమాన్స్ చేసిందో.

Also Read:Vijay: ‘ఫ్యామిలీ స్టార్’ తో హిట్ కొడతాడా?

- Advertisement -