శిరీష్‌తో డేటింగ్‌..నవ్వేసిన అను!

138
Anu
- Advertisement -

చాలాకాలం తర్వాత యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ఊర్వశివో రాక్షసివో అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చారు అల్లు శిరీష్. అను ఎమాన్యుయల్ హీరోయిన్ గా నటించగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా శిరీష్- అను కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో తమపై వస్తున్న గాసిప్స్ గురించి స్పందించింది అను. గాసిప్ చదివి అమ్మ చాలా బాధపడింది. వాస్తవానికి ఈ మూవీ ముందు వరకు అల్లు శిరీష్‌ని నేను కలవలేదు. ఫస్ట్ టైమ్ ఊర్వశివో రాక్షసివో మూవీ ఓపెనింగ్ రోజు పూజలోనే అతడ్ని కలిశాను అని చెప్పుకొచ్చింది.

నా పేరు సూర్య సినిమా సమయం నుండి అల్లు కుటుంబంతో మంచి ఫ్రెండ్ షిప్ ఉందని… ఆ చనువుతోనే ఓ రోజు అల్లు అరవింద్ డైరెక్ట్‌గా నా కొడుకు అల్లు శిరీష్‌తో డేటింగ్‌లో ఉన్నావా? అని అడిగారని తెలిపారు. ఆ తర్వాత ఆ గాసిప్ గురించి ఇద్దరం చాలా సేపు నవ్వుకున్నాం అని అని తెలిపింది అను.

ఇవి కూడా చదవండి..

జాతిరత్నాలు దర్శకుడికి అరుదైన వ్యాధి

BB6..సూర్యపై ఇనయా లవ్‌!

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్‌…గర్వపడే సినిమా

- Advertisement -