మజ్ను బ్యూటీ.. పట్టిందల్లా బంగారమే

229
Anu Emmanuel in Rajamouli movie
- Advertisement -

టాలీవుడ్ లక్కీ గాళ్ గా ఇప్పుడు మలయాళ భామ అను ఇమ్మాన్యుయెల్ ను చెప్పుకోవచ్చు. నాని మజ్ను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా చేసింది. రెండు చిన్న సినిమాలతోనే పవన్ త్రివిక్రం కాంబోలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ  అమ్మడు. ఇక ఆ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య’లో లీడ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా అను ఇమ్మాన్యుయెల్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. సరైనోడుతో బన్నికి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను అసలైతే మెగాస్టార్ తో సినిమా చేయాల్సి ఉంది కాని అందుకు రాసుకున్న కథ మార్చాల్సి ఉందట. అందుకే ఈలోపు రాం చరణ్ తో సినిమాకు సిద్ధమయ్యాడు బోయపాటి శ్రీను. సుకుమార్ తో చరణ్ చేస్తున్న రంగస్థలం సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

Anu Emmanuel in Rajamouli movie
అటు రాజమౌళి దర్శకత్వంలో  ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రంలోనూ అను ఇమ్మాన్యుయెల్  తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా అనుఇమ్మాన్యుయెల్ నటించనుందని తెలుస్తోంది. అదిరిపోయే కాంబినేషన్లో సినిమా కావడంతో పారితోషకం గురించి కూడా ఆలోచించకుండా వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పేసిందట అను.

- Advertisement -