అన్షి స్పందన నా హృదయాన్ని తాకింది- చిరు

272
chiru
- Advertisement -

అన్షి అనే చిన్నారి తన గొప్ప మనసును చాటుకుంది. కరోనా కష్టకాలంలో కోవిడ్ బాధితుల కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు తన వంతుగా విరాళం అందించింది. అయితే తమ ట్రస్టుకు అందించిన విరాళాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రముఖంగా ప్రస్తావించారు. పి.శ్రీనివాస్, హనీ దంపతుల కుమార్తె అన్షి తను దాచుకున్న డబ్బులతో పాటు, తన పుట్టినరోజు వేడుకలకు అయ్యే ఖర్చును కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చిందని చిరంజీవి వెల్లడించారు. ఆ డబ్బును చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు కోసం వినియోగించాలని అన్షి కోరిందని తెలిపారు. తన చుట్టూ ఉన్న ప్రపంచం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం అవుతుందని ఆ చిన్నారి చెబుతోందని కొనియాడారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆ చిన్నారి మాట్లాడిన వీడియోను కూడా చిరు పంచుకున్నారు.

ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘పి.శ్రీనివాస్, శ్రీమతి హరిణిల చిన్నారి పేరు అన్షి ప్రభాల. జూన్ 1న తన బర్త్ డే. తను దాచుకున్న డబ్బుతో పాటు.. తన ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు అయ్యే ఖర్చు కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తలపెట్టిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల కోసం ఇచ్చింది. ఈ సందర్భంగా తను.. ‘తన చుట్టూ ఉన్న సమాజం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం, సంబరం అవుతుంది’ అని తెలిపింది. ఆ చిన్నారి ఆలోచనకు, మంచి మనసుకు, తను వ్యక్త పరుస్తున్న ఈ ప్రేమకు నేను నిజంగా ముగ్ధుడినయ్యాను. అన్షి స్పందన నా హృదయాన్ని తాకింది. నన్ను మరింత ఇన్స్‌పైర్ చేసింది. తన డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలని నేను విష్ చేస్తున్నా. ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నానికి చేయూతనిస్తూ తన ఆశీస్సులను అందిస్తున్నాడని నేను భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అన్షి. హ్యాపీ బర్త్ డే. లవ్ యూ డార్లింగ్’’ అని అన్నారు.

- Advertisement -