ఎమ్మెల్యేల కొనుగోలు…విచారణకు మరో ఇద్దరు

107
- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేటకు చెందిన లాయర్ ప్రతాప్ గౌడ్‌కు నోటీసులు ఇచ్చింది. ఇక విచారణకు హాజరుకావాలని పేర్కొనడంతో వారు హాజరుకానున్నారు.

ఈ కేసులో కీలక నిందితులతో సంబంధాలున్న తుషార్‌ కనిపించకపోవడంతో సైబరాబాద్‌ పోలీసులు లుక్‌ఔట్‌ సర్క్యులర్‌(ఎల్‌ఓసీ) జారీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి తుషార్‌, జగ్గుస్వామితో సంబంధాలున్నట్టు ఆధారాలు లభించాయి. వారు దేశం విడిచి పారిపోకుండా అన్ని విమానాశ్రయాలు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు, అంతర్జాతీయ సరిహద్దుల్లోని అధికారులకు నోటీసులు పంపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -