పుష్ప మూవీకి మరో షాక్…!

384
pushpa
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ.. పుష్ప. పాన్ ఇండియా రేంజ్‌లో బాహుబలి తరహాలో రెండు పార్ట్‌లుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్టీ పుష్ప ది రైజ్ పేరుతో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళీ భాషల్లో విడుదల కాబోతుంది.

వరుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీని బీట్ చేసేలా పుష్ప సిన్మాతో ఆల్ ఓవర్ ఇండియాలో హ‌ల్‌చ‌ల్ చేయాల‌ని భావిస్తున్న బ‌న్నీ, చిత్ర ద‌ర్శక‌, నిర్మాత‌ల‌కు లీకుల స‌మ‌స్య పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుద‌ల‌కు ముందే లీకైంది.

దీంతో చిత్ర యూనిట్ అప్రమత్తమయ్యే లోపే ఓ ఫైట్ సీక్వెన్స్‌లో కొన్ని సెక‌న్స్‌ను లీకేజీ వీరులు లీక్ చేశారు. దీంతో చిత్ర యూనిట్ సైబర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.. ఇంతలోనే ‘వ‌ల్లీ వ‌ల్లీ..’ అంటూ బ‌న్నీ, ర‌ష్మిక‌పై సాగే మ‌రో సాంగ్‌లో కొన్ని సెక‌న్స్ లీకైన‌ట్లు టాక్ వినిపిస్తోంది. పుష్ప యూనిట్ వి.ఎఫ్.ఎక్స్ కోసం ఓ న‌ల‌బై ఐదు నిమిషాల ఫుటేజ్‌ను ఓ సంస్థ‌కు అప్ప‌గించింది. అక్క‌డ నుంచే ఇది లీకైంద‌ని భావిస్తున్నారు నిర్మాత‌లు. ఇప్ప‌టికే సైబ‌ర్ పోలీసుల‌కు వారు ఫిర్యాదు కూడా చేశారు. మ‌రి స‌ద‌రు వి.ఎఫ్‌.ఎక్స్ సంస్థ నుంచి మొత్తం ఫుటేజ్ లీకైందేమోన‌ని నిర్మాత‌లు టెన్ష‌న్‌ప‌డుతున్న‌ట్లు టాక్‌. ఈ లీకుల గోలెంట్రా బాబు..దాక్కో దాక్కో మేక అని సాంగ్‌ కాదు..ముందు సిన్మా బయటకు రాకుండా ఫుటేజ్‌ని భద్రంగా దాచిపెట్టండి అంటూ సుక్కూ సార్‌కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్లాస్ తీసుకుంటున్నారంట..

- Advertisement -