సంచలనం.. త్వరలో బీజేపీకి ఈటల గుడ్‌బై..?

241
rajender
- Advertisement -

బీజేపీ నేత ఈటల రాజేందర్‌ రాజకీయ భవిష్యత్తుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. వామపక్ష నేపథ్యం ఉన్న ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. సీఎం కేసీఆర్‌తో విబేధించి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష భావజాలం ఉన్న కోదండరామ్ వంటి భావసారూప్యం కలిగిన నేతలతో కలిసి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కోదండరామ్, ఈటలను కలిపి కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నించారు. . కోదండరామ్, కొండా విశ్వేశ్వర రెడ్డిలు స్వయంగా ఈటల రాజేందర్‌ను కలిసి తమతో కలిసిరావాల్సిందిగా కోరారు. అయితే ఈటల మాత్రం అనూహ్యంగా బీజేపీలో చేరారు. కేవలం తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, వేల కోట్ల అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరినట్లు ఈటలపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

అయితే ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ఓ రకంగా ఈటల రాజేందర్‌ పొలిటికల్ ఫ్యూచర్‌ను డిసైడ్ చేయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈటల రాజేందర్‌ బీజేపీలో అంత కంఫర్ట్‌గా లేరు. నిన్న, మొన్నటి వరకు, వ్యవసాయ నల్లచట్టాలు, కొత్త విద్యుత్ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఈటల రాజేందర్‌ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాషాయ కండువా కప్పుకుని కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు మద్దతుగా మాట్లాడాల్సి రావడం ఆయనకు నైతికంగా ఇబ్బందికర పరిణామమే. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పేరుకు బీజేపీ అభ్యర్థి అయినా ఈటల ఒంటరి పోరు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నాయకుల నుంచి కానీ..అగ్ర నాయకత్వం నుంచి ఆయనకు పెద్దగా సపోర్ట్‌ దక్కడం లేదు. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు అమాంతం పెరిగిన వేళ……కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో కేవలం తన ఫోటోలతో తప్పా,.,.మోదీ, అమిత్‌షాల ఫోటోలతో ప్రచారం చేసేందుకు ఈటల ఇష్టపడడం లేదు. బీజేపీ విధానాలతో ప్రజల ముందుకు వెళితే తాను ఓడిపోవడం ఖాయమని ఈటల ఫిక్స్ అయ్యారు. అందుకే హుజూరాబాద్ పోరును బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ గా కాకుండా ఈటల వరెస్ టీఆర్ఎస్‌గా మార్చారు.

ఈటల రాజేందర్‌ తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు గుస్సా అవుతున్రు..మరోవైపు దళితబంధు పథకం, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, హుజూరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈటలలో ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటి వరకు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు కాస్త ఎడ్జ్ ఉందని, ఆయనపై సింపతీ వర్కవుట్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే సీఎం కేసీఆర్ సభతో హుజూరాబాద్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చివరి వరకు గెలుపు కోసం ఈటల పోరాడాల్సి వస్తుంది. ఆలోపే టీఆర్ఎస్ గ్రామాలవారీగా హవా చూపించడం ఖాయమని, ఇప్పుడున్న సెంటిమెంట్ కూడా తగ్గి ఈటల ఓడిపోవడం ఖాయమని హుజూరాబాద్‌లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఈటలను కాషాయ నేతలు కరివేపాకులా తీసేస్తారు. ఆత్మాభిమానం చంపుకుని ఆయన బీజేపీలో కొనసాగుతారా లేదా అనే విషయమై ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం రాంగ్ డెసిషన్ అని, ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా కాస్త గౌరవం ఉండేదని, కాషాయ పార్టీలో చేరి ప్రజల్లో ఉన్న ఇమేజ్‌ను పోగొట్టుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాలం కలిసిరాక ఓడిపోతే ఆయన కాషాయ పార్టీలో కొనసాగడం అనుమానమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమ నాయకుడైన ఈటల హుజూరాబాద్‌లో గెలిస్తే బీజేపీలో కొనసాగుతారు. ఒక వేళ ఓడిపోతే.. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో ఉండరని, కాంగ్రెస్ పార్టీలో చేరడమా లేదా…కోదండరామ్ వంటి భావసారూప్యత ఉన్న నాయకులతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు సారథ్యం వహిస్తారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా హుజూరాబాద్ బై ఎలక్షన్ ఈటల రాజేందర్‌ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -