ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురికి ఏడేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో గాలికి మరో షాక్ తగిలింది. ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తూ కర్ణాటక అసెంబ్లీ ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక విధాన సభ కార్యదర్శి ఎంకే విశాలాక్షి ఉత్తర్వులు జారీ చేసింది.
గంగావతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(ఇ), ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8 నిబంధనల మేరకు ఆయన శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు విశాలక్షి.
జనార్దన్ రెడ్డికి విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే.. విడుదలైన నాటి నుంచి మరో ఆరేండ్లపాటు అనర్హత కొనసాగుతుంది అని అందులో పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డిపై అనర్హత వేటు వేసిన తక్షణమే అసెంబ్లీలో ఒక స్థానం ఖాళీ అయ్యిందంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read:హాలీవుడ్‌లోకి కంగనా!

