ఏపీ సీఎం చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్టే ఎత్తివేతకు కోర్టు నిరాకరించింది. 2005లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి…చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. దీంతో చంద్రబాబుకు రిలీఫ్ లభించగా తాజాగా సుప్రీం ఆదేశాల మేరకు ఆరు నెలల స్టే సమయం దాటని కేసుల్లో స్టే వెకేట్ అవుతుంది. దీంతో కేసులో విచారణ తిరిగి ప్రారంభమైంది.
ఈ కేసులో భాగంగా కోర్టుకు హాజరుకావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారీ కావడంతో ఆమె న్యాయస్ధానంలో హాజరయ్యారు. కేసు స్టేటస్‌పై మే 13న హైదరాబాద్ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసుతో మిగితా కేసుల్లో చంద్రబాబు తెచ్చుకున్న స్టేలపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది.
ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు ప్రతిసారి భిన్నమైన ఆస్తులు చూపించారని 2005లో లక్ష్మీపార్వతి న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. బాబు అంత అవినీతి పరుడు దేశంలోనే లేరని అందుకే తాను ఆయనపై పోరాడుతున్నానని ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి తెలిపారు.