నాగ్‌తో రకుల్‌ వర్కౌట్.. వీడియో

214
Manmadhudu 2

కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోన్న చిత్రం ‘మన్మథుడు 2’. అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న చిత్ర యూనిట్ రెండో షెడ్యూల్ నిమిత్తం పోర్చుగల్ వెళ్లింది. అక్కడే ఎక్కువ శాతం షూటింగ్ జరగనుంది. అయితే పోర్చుగల్‌లో నాగార్జున,రకుల్‌ ఫిట్‌నెస్ కోసం చేస్తోన్న వర్కౌట్స్ సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.

Manmadhudu 2

ఈ వీడియోను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా తీశారు. రాహుల్, నాగార్జున మధ్య జరిగిన సంభాషణతో కూడిన వీడియో ఇది. దీనిలో రకుల్ ప్రీత్ కూడా కనిపించారు. ఈ వీడియోను నాగార్జున తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మరి ఆలస్యం ఎందుకు మీరూ ఈ వీడియోని చూడండీ..!!